Header Banner

ఎండల దెబ్బకి ఎక్కువగా ఏసీలో ఉంటున్నారా! జాగ్రత్త.. ఈ రకాల సమస్యలకు అదే కారణం!

  Sun May 04, 2025 07:58        Health

తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నిప్పుల కుంపటిని తలపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏసీల వాడకం బాగా పెరిగింది. విపరీతమైన ఎండల ధాటికి తట్టుకోలేక గంటలకొద్దీ ఎసి రూముల్లో కూర్చుంటున్నారు జనాలు. అయితే ఏసీ అధికంగా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్యాలు కలుగుతాయని చెబుతున్నారు వైద్యులు.

 

ఎక్కువసేపు ఏసీలలో ఉంటే జరిగేదిదే

ఏసీ అధిక వినియోగం వల్ల ఆరోగ్యం పైన ఎటువంటి ప్రభావం పడుతుందో ప్రస్తుతం తెలుసుకుందాం.ఏసీని అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో తేమ తగ్గిపోతుంది. ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఒళ్ళు కాస్త దురదగా అనిపించే ప్రమాదం ఉంటుంది. ఏసీ అధిక వినియోగం వల్ల కళ్ళు పొడిబారుతాయి.

 

ఏసీలలో ఎక్కువ ఉంటే కళ్ళ సమస్య

కంప్యూటర్లు, ల్యాప్టాప్ల మీద ఎక్కువ సమయం వర్క్ చేసే వారికి కూడా కళ్లు పొడిబారే సమస్య వస్తుంది. ఇలాంటి వాళ్లు ఎక్కువ సేపు ఏసీ లలో ఉండడం వల్ల సమస్య మరింత తీవ్రతరమవుతుంది. కళ్ళ దురద, చిరాకు పెరుగుతాయి. ఫలితంగా కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

 

ఇది కూడా చదవండి డయాబెటిక్ పేషెంట్స్‌కి బెస్ట్ డైట్! ఇన్‌సులిన్‌కి సహాయపడే ఆహారాలు ఇవే..!

 

ఏసీలలో చర్మ ఆరోగ్యంపై ప్రభావం

ఏసీలో అధికంగా ఉండటం వల్ల చర్మంలో సహజంగా ఉండే నూనె ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో చర్మం డీహైడ్రేట్ అవుతుంది. ఏసీ నుండి వచ్చే పొడి గాలికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీల వల్ల రోసేసియా, సోరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి.

 

ఏసీతో అకాల వృద్ధాప్యం ఏసీ లలో ఎక్కువగా ఉండటం వల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది. చర్మం ముడతలు పడిపోతుంది. చర్మంలో ఎలాస్టిసిటీ తగ్గుతుంది. ఏసీ లలో ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టు పొడిబారి ఎక్కువగా రాలిపోతుంది. దద్దుర్లు, అలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

 

ఏసీలలో ఉంటే ఈ సమస్యలు .. జాగ్రత్త

ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఉబ్బసం, ఇతర అంటూ వ్యాధులు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా చర్మం డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి కంటిన్యూగా ఏసీలో ఉండకుండా మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటే మంచిది. అలాగే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది.

 

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   andhrapravasi #ACHealthRisks #HeatWaveAlert #StayCoolStaySafe #AndhraSummer #TeluguStatesHeat #ExcessiveACUse